News5th Sep 11:17 AMSunil Byrisetty1 min read

ఏ డిజైన్ బాగుందో ఓటేయండి

కృష్ణా నదిపై రాజధాని నుంచి విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారికి అనుసంధానించేందుకు ప్రభుత్వం ఐకానిక్ వంతెనను నిర్మించేందుకు అడుగులు వేస్తోంది. ఈ మేరకు నాలుగు డిజైన్లను ఎంపిక చేసింది.

ఏ డిజైన్ బాగుందో ఓటేయండి
కృష్ణా నదిపై రాజధాని నుంచి విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారికి అనుసంధానించేందుకు ప్రభుత్వం ఐకానిక్ వంతెనను నిర్మించేందుకు అడుగులు వేస్తోంది. ఈ మేరకు నాలుగు డిజైన్లను ఎంపిక చేసింది. ఆధునిక ఇంజినీరింగ్ శైలిలో కూచిపూడి కళను మేళవించి అమరావతిని గుర్తుకు తెచ్చేలా వీటిని రూపొందించారు. ఎంపిక కోసం ఆయా డిజైన్లను సీఆర్డీఏ వెబ్ సైట్లో ఓటింగ్ కు పెట్టారు. 3 నమూనాలు కూచిపూడి నృత్యాన్ని ప్రతిబింబిస్తే... ఒకటి అమరావతికి సూచికగా ఆంగ్ల అక్షరం 'A' ఆకారంలో ఉంది. ఓటింగ్ కు https://crda.ap.gov.in/apcrdav2/userInterface/Bridge_poll_Tel.aspx వెబ్ సైట్లోకి వెళ్లి పేరు, ఫోన్ నెంబర్ ఇచ్చి, 4 డిజైన్లలో ఒక దాన్ని ఎంచుకోవాలి. తర్వాత కింద ఉన్న క్యాప్చా నమోదు చేసి, సబ్మిట్ చేయాలి.
Andhra Pradesh Infrastructure
Krishna River Bridge
Amaravati
Vijayawada
Hyderabad
Iconic Bridge
Modern Engineering
Kuchipudi Art
Bridge Design
APCRDA
Public Voting
Landmark Bridge
State Development
Architectural Designs
CRDA Bridge Poll
Scroll for the next article