National25th Jan 03:14 PMSunil Byrisetty1 min read
ఓటు హక్కు మాత్రమే కాదు.. బాధ్యత
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, అర్హత కలిగిన ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకొని ఓటు హక్కును వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విజయానం
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, అర్హత కలిగిన ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకొని ఓటు హక్కును వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విజయానంద్ తెలిపారు. విజయవాడ తుమ్మల పల్లి కళాక్షేత్రంలో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రధాన కార్యదర్శి కే. విజయానంద్ హాజరై మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటామన్నారు. భారత ఎన్నికల సంఘం 1950, జనవరి 25న స్థాపించబడిన ప్రకారం ఈ రోజున నిర్వహిస్తామన్నారు. ఓటింగ్ ప్రక్రియలో పౌరుల భాగస్వామ్యాన్ని పెంచడం, ముఖ్యంగా యువ ఓటర్లను ప్రోత్సహించడం, వారి హక్కులు, బాధ్యతలపై అవగాహన కల్పించడం ఈ దినోత్సవ ప్రధాన ఉద్దేశ్యమన్నారు. ఈ ఏడాది "నా భారత్ - నా ఓటు" (My India, My Vote) థీమ్ తో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఓటు వేయడం కేవలం ఒక హక్కు మాత్రమే కాదు.. ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు. ప్రతి ఓటు ప్రజాస్వామ్య భారత నిర్మాణానికి బలమైన పునాది వేస్తుందన్నారు. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, దీని బలం పౌరుల భాగస్వామ్యంలోనే ఉందన్నారు. 18 ఏళ్లు నిండిన అర్హులైన ప్రతి పౌరుడిని ఓటరుగా నమోదు చేసి, వారికి ఓటరు గుర్తింపు కార్డులు (EPIC) అందించేందుకు ఎన్నికల సంఘం నిరంతరం కృషి చేస్తోందన్నారు.