Spiritual28th Nov 12:54 PMSunil Byrisetty1 min read
భక్తులకు సౌకర్యంగా వుండేందుకు వెయింటింగ్ హాల్స్
రాబోయే పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని భక్తులు, యాత్రికులు, వృద్ధులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అమ్మవారి దర్శనం జరిగేలా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ అభివృద్ధి పనులు చేపట్టనున్నట
రాబోయే పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని భక్తులు, యాత్రికులు, వృద్ధులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అమ్మవారి దర్శనం జరిగేలా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో భక్తుల సౌకర్యం కోసం వెయిటింగ్ హాల్స్ నిర్మించేందుకు, పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేసేందుకు ఎంపీ కేశినేని శివనాథ్ శుక్రవారం ఆలయ ఈవో శీనా నాయక్, ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు. అలాగే రాబోయే పుష్కరాల నిర్వహణ, ఆలయ అభివృద్ధిపై జరిగిన సమీక్షా సమావేశంలో డిసెంబర్ 11 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించన్ను భవానీ దీక్షల విరమణ ఏర్పాట్ల గురించి ఆలయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆలయం ప్రదేశంలో వెయిటింగ్ హాల్స్, పార్కింగ్ ప్రదేశాలు ఎక్కడ నిర్మిస్తే బాగుంటుందనే అంశంపై అధికారులతో ఆలయ ప్రాంగణం పరిశీలించారు.