News3rd Apr 01:19 PMSunil Byrisetty1 min read
నేడు రాజ్యసభకు వక్ఫ్ బిల్లు.. లోక్ సభలో ఆమోదం
కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టంపై దూకుడుగా అడుగులు వేస్తోంది. లోక్ సభలో బిల్లు ప్రవేశపెట్టగా అనుకూల ఓట్లు 288.. వ్యతిరేకంగా 232 ఓట్లు వచ్చాయి. ఈ బిల్లుపై 14 గంటలకు పైగా సుదీర్ఘ స
కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టంపై దూకుడుగా అడుగులు వేస్తోంది.
లోక్ సభలో బిల్లు ప్రవేశపెట్టగా అనుకూల ఓట్లు 288.. వ్యతిరేకంగా 232 ఓట్లు వచ్చాయి.
ఈ బిల్లుపై 14 గంటలకు పైగా సుదీర్ఘ సమావేశం నిర్వహించారు.
తెల్లవారుజామున 2.30 వరకూ చర్చించిన తర్వాత ఓటింగ్ నిర్వహించారు.
వక్ఫ్ సవరణ బిల్లుకు ఎన్డీయే ప్రధాన భాగస్వామ్యపక్షాలైన టీడీపీ, జేడీ(యు), శివసేన (శిందే), లోక్ జనశక్తి పార్టీ (రాంవిలాస్) మద్దతుగా నిలిచాయి.
విపక్ష ఇండియా కూటమిలోని పార్టీలన్నీ బిల్లును వ్యతిరేకించాయి.
వైసీపీ కూడా బిల్లుకు ప్రతికూలంగానే స్పందించింది.
అయినప్పటికీ మెజారిటీ రావడంతో బిల్లు లోక్ సభలో పాసైంది.
నేడు రాజ్యసభలో దీనిపై చర్చ జరగనుంది.