News19th Mar 06:02 PMSunil Byrisetty1 min read
మా 55 కోట్లు ఇచ్చేయండి.. తెలంగాణకు ఏపీ వినతి
తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ కార్యాలయంలో ఆ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనితో ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ భేటీ అయ్యారు. అజీజ్ మాట్లాడుతూ, రాష్ట్ర
తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ కార్యాలయంలో ఆ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనితో ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ భేటీ అయ్యారు.
అజీజ్ మాట్లాడుతూ, రాష్ట్ర విభజనలో భాగంగా భారత ప్రభుత్వ మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2015లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వేర్వేరు వక్ఫ్ బోర్డులు ఏర్పాటు చేయాలని కీలక నిర్ణయం తీసుకుందని అన్నారు.
ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిందని, తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డులో ఉన్న డిపాజిట్లు, పెట్టుబడులు, నగదు నిల్వలను ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డుకు బదిలీ చేయాలని గెజిట్‌లో స్పష్టంగా పేర్కొందని తెలిపారు.
ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన కోట్ల రూపాయల నిధులు, రాష్ట్రానికి సంబంధించిన పాత రికార్డులు ఇప్పటివరకు అప్పగించలేదని తెలిపారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని ఆంధ్ర రాష్ట్ర వక్ఫ్ బోర్డుకు రావాల్సిన రూ. 55,49,44,123/- త్వరితగతిన బదిలీ చేయాలని కోరారు.
అలాగే ఫైళ్లూ, సర్వే పత్రాలూ, జిల్లాల వారీగా గెజెట్లూ, బోర్డు తీర్మానాల ప్రతులూ, పాత రికార్డులన్నీ తమకు అందచేయాలని కోరారు. దీని పై తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
రంజాన్ పండుగ తర్వాత ఇరు రాష్ట్రాల వక్ఫ్ బోర్డ్ చైర్మన్ లు, బోర్డ్ సభ్యులు, అధికారులు కలిసి సమీక్షించి ప్రణాళిక రూపొందించి ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు పంపి సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని ఇరువురు చైర్మన్లు నిర్ణయించారు.