News15th Apr 01:04 PMSunil Byrisetty1 min read

గుంటూరు మస్తాన్ దర్గాపై గందరగోళం

గుంటూరు మస్తాన్ దర్గా స్వాధీనానికి జిల్లా వక్ఫ్ బోర్డు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 11న మస్తాన్ దర్గాకు వచ్చిన వక్ఫ్ అధికారులు స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. దర్గాకు ధ

గుంటూరు మస్తాన్ దర్గాపై గందరగోళం
గుంటూరు మస్తాన్ దర్గా స్వాధీనానికి జిల్లా వక్ఫ్ బోర్డు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 11న మస్తాన్ దర్గాకు వచ్చిన వక్ఫ్ అధికారులు స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. దర్గాకు ధర్మకర్తగా ఉన్న రావి రామ్మోహన్ రావుకు సమాచారమిచ్చారు. ఈ నెల 14 వరకు గడువు కోరిన రామ్మోహన్ రావు, ఆ రోజున దర్గాలో అందుబాటులోకి రాలేదు. దీంతో మంగళవారం స్వాధీనం చేసుకుంటామని చెబుతున్నారు. ఈ విషయంపై స్పందించిన రామ్మోహన్ రావు భార్య రావి డూండేశ్వరి మస్తాన్ దర్గా వక్ఫ్ పరిధిలోకి రాదని తేల్చి చెప్పారు. 2000 సంవత్సరంలో ప్రిన్సిపల్ జిల్లా కోర్టు తీర్పు ఇచ్చిందని, అప్పటి నుంచి వక్ఫ్ పరిధిలో లేదని పన్నులు కట్టడం లేదని వివరించారు. తమకు ముందుగా ఎటువంటి నోటీసులు ఇవ్వలేదని, 11న వచ్చి స్వాధీనం చేసుకుంటామని అన్నారని చెప్పారు. 14న అధికారులు విజయవాడలో కలవమని అన్నారని, అక్కడికి వెళ్తే అధికారులు స్పందించలేదని వివరించారు.
Guntur
Mastan Dargah
Waqf Board
మస్తాన్ దర్గా స్వాధీనానికి జిల్లా వక్ఫ్ బోర్డు అధికారులు
రావి రామ్మోహన్
Scroll for the next article