News1st Mar 09:59 AMSunil Byrisetty1 min read

వక్ఫ్ బోర్డ్ ఆదాయం పెంచేస్తాం

వక్ఫ్ బోర్డ్ కు ఆదాయం పెంచే విధంగా అడుగులు వేస్తున్నామని ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. ఈ మేరకు వేసిన తొలి అడుగులోనే విజయం సాధించామని ఆయన తెలిపారు. కర్నూల్ జి

వక్ఫ్ బోర్డ్ ఆదాయం పెంచేస్తాం
వక్ఫ్ బోర్డ్ కు ఆదాయం పెంచే విధంగా అడుగులు వేస్తున్నామని ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. ఈ మేరకు వేసిన తొలి అడుగులోనే విజయం సాధించామని ఆయన తెలిపారు. కర్నూల్ జిల్లా ఎల్లార్తి గ్రామం షేక్ షావలి షాషావలి దర్గా టెండర్ల ద్వారా వక్ఫ్ బోర్డ్ కు ఆదాయం పెంచామని అన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వక్ఫ్ బోర్డు పరిధిలో డైరెక్ట్ మేనేజ్మెంట్ లో ఉన్న దర్గాలకు టెండర్ల పిలుస్తామని తద్వారా వక్ఫ్ బోర్డ్ కు ఆదాయం పెరుగుతుందని ఆయన వివరించారు. వక్ఫ్ బోర్డ్ కు ఆదాయాన్ని పెంచడంతో పాటు, వక్ఫ్ బోర్డ్ ఆస్తుల ఆక్రమణలను తొలగించడమే లక్ష్యంగా పనిచేస్తామని, రానున్న రోజుల్లో వక్ఫ్ బోర్డ్ అభివృద్ధి, ముస్లిం సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తానని అన్నారు.
wakf
bill
parliament
board
news
Telugu
news update
వక్ఫ్
బిల్లు
చట్టం పార్లమెంట్
బోర్డు
వార్తలు
తెలుగు
వార్తలు
Scroll for the next article