News14th Dec 12:56 PMSunil Byrisetty1 min read
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి వార్నింగ్!
విజయవాడలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి డీసీపీ హెచ్చరికలు జారీ చేశారు. అనధికారక సైరెన్లు వినియోగిస్తే వారి తాటతీస్తామన్నారు. త్వరలో ట్రాఫిక్ పోలీస్ స్పెషల్ డ్రైవ్ కు రంగం సిద
విజయవాడలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి డీసీపీ హెచ్చరికలు జారీ చేశారు. అనధికారక సైరెన్లు వినియోగిస్తే వారి తాటతీస్తామన్నారు. త్వరలో ట్రాఫిక్ పోలీస్ స్పెషల్ డ్రైవ్ కు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
కొంతమంది ఉద్దేశపూర్వకంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారన్నారు. అంబులెన్సులు, సీఎం, పీఎం, పోలీస్ కాన్వాయ్ లకు మాత్రమే సైరన్ అనుమతి ఉందని స్పష్టం చేశారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారి పట్ల లేడీ గానుగ వ్యవహరిస్తానని ట్రాఫిక్ డిసిపి షిరిన్ బేగం పేర్కొన్నారు.