Politics18th Oct 02:03 PMSunil Byrisetty1 min read
2024 ఎన్నికల్లో మోసం జరిగిందా? జగన్ ప్రశ్న
2024 జనరల్ ఎలక్షన్స్ లో తారుమారు జరిగాయని ఆనాడే చెప్పానని, అందుకే ఫలితాలు నెగటివ్ గా వచ్చాయని, అది అర్థం కాలేదనే కోర్టులో కేసులేశామని వైయస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్
2024 జనరల్ ఎలక్షన్స్ లో తారుమారు జరిగాయని ఆనాడే చెప్పానని, అందుకే ఫలితాలు నెగటివ్ గా వచ్చాయని, అది అర్థం కాలేదనే కోర్టులో కేసులేశామని వైయస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యవాదులు ఎంతోమంది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో తప్పులను హైలైట్ చేస్తూ ఇంటర్వ్యూలు ఇచ్చారు, కోర్టులో కేసులు వేశారన్నారు. సాక్ష్యాలు, ఆధారాలతో సహా ప్రజంటేషన్ కూడా చేశామన్నారు. అందుకే వ్యవస్థలో మార్పు రావాలని, నియామకాలు పారదర్శకంగా జరగాలని అన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అయినా, కేంద్ర ఎన్నికల కమిషనర్ ను అయినా అధికార పార్టీలు నామినేట్ చేసే వ్యవస్థ రాకూడదని వ్యాఖ్యానించారు. గతంలో అధికార పార్టీ సీఈసీని నామినేట్ చేసే ప్రక్రియకు వైయస్సార్సీపీ మద్దతిచ్చిందని, కానీ నేడు రిగ్రట్ అవుతున్నాం, మద్దతు ఇచ్చి తప్పు చేశామని రిగ్రెట్ అవుతున్నామని పేర్కొన్నారు.