News7th Nov 04:04 PMSunil Byrisetty1 min read
వెలిగొండ ఆయకట్టుకు 2026 కల్లా నీరు
వెలిగొండ ప్రాజెక్టు పనులు వచ్చే సంవత్సరానికి పూర్తి చేసి ఆయకట్టు రైతాంగానికి పూర్తిస్థాయిలో నీరు అందిస్తామని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ఇటీవల మొం
వెలిగొండ ప్రాజెక్టు పనులు వచ్చే సంవత్సరానికి పూర్తి చేసి ఆయకట్టు రైతాంగానికి పూర్తిస్థాయిలో నీరు అందిస్తామని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ఇటీవల మొంథా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న వెలిగొండ ఫీడర్ కెనాల్ ను ఇరిగేషన్ నిపుణుల బృందంతో శుక్రవారం ఆయన పరిశీలించారు. మెంథా తుఫాన్ వర్షాలకు ఫీడర్ కెనాల్ 850 మీటర్ వద్ద, వంద అడుగుల పొడవున 30 అడుగుల లోతులో పడిన గండిని చూశారు.
జంట సొరంగాలలోకి 9 కి.మీ చొచ్చుకు వచ్చిన నీటిని తొలగించే పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో కూడా వచ్చే వరదలను దృష్టిలో పెట్టుకుని ఫీడర్ కెనాల్ సీసీ వాల్ లైనింగ్ నిర్మాణంలో డిజైన్స్ అప్రూవల్ చేయమని సూచించారు. ఈ సందర్భంగా వెలిగొండ క్యాంప్ ఆఫీస్ లో ప్రాజెక్ట్ పెండింగ్ పనులపై అధికారులు, ఏజెన్సీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 30 ఏళ్ల కిందట తను భూమి పూజ చేసిన ఈ ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తవ్వకపోవడంపై తీవ్ర ఆవేదన చెందినట్లు రామానాయుడు చెప్పారు.