News19th Sep 10:58 AMSunil Byrisetty1 min read
శ్రీశైలం ప్రాజెక్టుకు క్రమంగా పెరుగుతున్న వరద
శ్రీశైలం ప్రాజెక్టుకు వరద క్రమంగా పెరుగుతోంది. జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల నుంచి వరద పెరుగుతుండటంతో మరో గేటు ఎత్తి నీటి విడుదల చేశారు. ప్రస్తుతం 8 గేట్ల ద్వారా నాగార్జునసాగర్‌కు న
శ్రీశైలం ప్రాజెక్టుకు వరద క్రమంగా పెరుగుతోంది. జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల నుంచి వరద పెరుగుతుండటంతో మరో గేటు ఎత్తి నీటి విడుదల చేశారు. ప్రస్తుతం 8 గేట్ల ద్వారా నాగార్జునసాగర్‌కు నీటి విడుదలవుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 2,84,701 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 3,18,416 క్యూసెక్కులుగా ఉంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 30 వేల క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. శ్రీశైలం ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 884.40 అడుగులకు చేరింది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా.. శ్రీశైలం ప్రాజెక్టు ప్రస్తుత నీటినిల్వ 211.95 టీఎంసీలుగా ఉంది.