Mobiles12th Jun 01:48 PMSunil Byrisetty1 min read
తడిసినా ఏమీ కాదు.. వాటర్ ప్రూఫ్ ఫోన్లు!
అన్ని పనులు మొబైల్ తోనే చేస్తు్న్న ప్రస్తుత కాలంలో ఫోన్ భద్రత ముఖ్యంగా మారిపోయింది. రాబోయే వర్షాకాలంలో తడిసినా పని చేసే వాటర్ ప్రూఫ్ మొబైల్, అదీ బడ్జెట్ ధరలో చూస్తున్నారా.. ఈ స్మార
అన్ని పనులు మొబైల్ తోనే చేస్తు్న్న ప్రస్తుత కాలంలో ఫోన్ భద్రత ముఖ్యంగా మారిపోయింది. రాబోయే వర్షాకాలంలో తడిసినా పని చేసే వాటర్ ప్రూఫ్ మొబైల్, అదీ బడ్జెట్ ధరలో చూస్తున్నారా.. ఈ స్మార్ట్ ఫోన్ నీళ్లలో తడిసినా ఇబ్బంది లేదు. IP68 లేదా IP68 + IP69 రేటింగ్‌తో వాటర్ ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. వాటర్ ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్ల ధర విషయానికి వస్తే.. రూ. 13వేల నుంచి రూ. 70వేల వరకు ఉంటాయి. ప్రస్తుతం ఫ్లిప్కార్ట్, అమెజాన్‌లలో డిస్కౌంట్‌లతో అందుబాటులో ఉన్నాయి.
మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ :
ఫ్లిప్‌కార్ట్‌లో మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ 5G ఫోన్ 8GB ర్యామ్, 256GB స్టోరేజ్‌తో రూ.22,999కి విక్రయిస్తోంది. IDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కొనుగోళ్లపై బ్యాంక్ రూ.1500 తగ్గింపును అందిస్తోంది. డిస్కౌంట్‌తో ఫైనల్ ధర రూ.21,499 అవుతుంది. ఈ ఫోన్ IP68 రేటింగ్‌ను కలిగి ఉంది. మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్‌లోని డిస్‌ప్లే 6.67 అంగుళాలు కలిగి ఉంది. ఈ ఫోన్‌లో 5500mAh బ్యాటరీ కలిగి ఉంది. 68W వద్ద ఛార్జ్ చేయవచ్చు. 50MP ప్రైమరీ కెమెరాతో వస్తుంది.