Politics7th Aug 04:23 PMSunil Byrisetty1 min read

మాది బ్రాండ్ ఇమేజ్... వాళ్లది బ్యాడ్ ఇమేజ్

వైసీపీ నేతలు మావిగన్, వాటికన్ అంటూ ఏవోవో చెబుతున్నారని సీఎం చంద్రబాబు ఎద్దేవా చేశారు. మళ్లీ మూడు ముక్కలాట కావాలా...? రాజధానిని విధ్వంసం చేసుకుంటామా.. అని ప్రశ్నించారు. కుటుంబానికి

మాది బ్రాండ్ ఇమేజ్... వాళ్లది బ్యాడ్ ఇమేజ్
వైసీపీ నేతలు మావిగన్, వాటికన్ అంటూ ఏవోవో చెబుతున్నారని సీఎం చంద్రబాబు ఎద్దేవా చేశారు. మళ్లీ మూడు ముక్కలాట కావాలా...? రాజధానిని విధ్వంసం చేసుకుంటామా.. అని ప్రశ్నించారు. కుటుంబానికి ఇల్లు, రాష్ట్రానికి రాజధాని అవసరమని తేల్చి చెప్పారు. గత ప్రభుత్వం రాష్ట్ర పరువును తీసేసిందని, ఇమేజ్ ను దారుణంగా దెబ్బతీసిందని చీరాలలో నిర్వహించిన నేతన్న సేవలో కార్యక్రమంలో మాట్లాడారు. కూటమి వచ్చాక మళ్లీ ఏపీ బ్రాండ్ ను పునరుద్ధరించామన్నారు. వాళ్లది బ్యాడ్ ఇమేజ్... మాది బ్రాండ్ ఇమేజ్ అని వ్యాఖ్యానించారు. కోర్టు కేసులు వేసి అడ్డుకున్నా మెగా డీఎస్సీ ద్వారా 16 వేల ఉద్యోగాలు ఇచ్చామని, ఏడాదిన్నర తర్వాత ఇప్పుడు మళ్లీ పేపర్ లీక్ అంటూ కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జెన్-జీ యువత అభివృద్ధిని కోరుకుంటోందన్నారు. కానీ కొందరు గొడ్డలి జనరేషన్ కు చెందిన వారు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.
Andhra Pradesh
YSRCP
Amaravati
N. Chandrababu Naidu
AP Politics
Netanna Sevalo
మెగా డీఎస్సీ
ఏపీ అభివృద్ధి
బ్రాండ్ ఏపీ
రాజకీయ ప్రసంగం
టీడీపీ
ఆంధ్ర వార్తలు
Scroll for the next article