Politics24th Jul 03:17 PMSunil Byrisetty1 min read
పొత్తులో అన్ని పదవులు అడగలేం!
మంత్రి, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన ఆ పార్టీ సమీక్షా సమావేశం జరిగింది. అందులో పార్టీ కోసం పనిచేయాలని.. గ్రూపు రాజకీయాలు వద్దని నాదెండ్ల సూచించారు. పొత్తులో ఉన్నాం
మంత్రి, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన ఆ పార్టీ సమీక్షా సమావేశం జరిగింది. అందులో పార్టీ కోసం పనిచేయాలని.. గ్రూపు రాజకీయాలు వద్దని నాదెండ్ల సూచించారు. పొత్తులో ఉన్నాం కాబట్టి.. అన్ని పదవులు ఒకేసారి అడగలేమని చెప్పారు. జనసేన, పవన్‌పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించారు. విజయవాడ కార్పొరేషన్ పరిధిలోని 64 డివిజన్లలో జనసేన బలంగా ఉందన్నారు. ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి, ఎక్కడ పోటీ చేయాలి అనేది పవన్ నిర్ణయిస్తారని చెప్పారు. పొత్తులో ఉన్నాం కనుక పొత్తు ధర్మం పాటించాలని పిలుపునిచ్చారు. కూటమి బలోపేతం కోసం మనమంతా పనిచేయాలని నాదెండ్ల సూచించారు.