News6th Oct 04:25 PMSunil Byrisetty1 min read

సుప్రీంలో బీసీలకు న్యాయం జరుగుతుందనుకుంటున్నాం

బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల్లోనే హామీ ఇచ్చామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. 1995 చట్టం ఆధారంగానే ఇప్పుడు రెండు

సుప్రీంలో బీసీలకు న్యాయం జరుగుతుందనుకుంటున్నాం
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల్లోనే హామీ ఇచ్చామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. 1995 చట్టం ఆధారంగానే ఇప్పుడు రెండు జీవోలు ఇచ్చామన్నారు. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వైసీపీ నేతలు కోర్టులో కేసు వేయించారని ఆరోపించారు. 34 శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లను 24 శాతానికి ఎందుకు తగ్గించారో జగన్ సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. సుప్రీంకోర్టులో బీసీలకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నామని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. సమావేశంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ మంత్రులు, అనగాని సత్యప్రసాద్, పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.
Scroll for the next article