News30th Dec 06:01 PMSunil Byrisetty1 min read

విజయవాడలో నేరాలు తగ్గించగలిగాం

విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సీపీ ఎస్.వి.రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో 2025 వార్షిక నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. గత సంవత్సరం సహకరించిన మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు. సురక్ష కార్

విజయవాడలో నేరాలు తగ్గించగలిగాం
విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సీపీ ఎస్.వి.రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో 2025 వార్షిక నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. గత సంవత్సరం సహకరించిన మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు. సురక్ష కార్యక్రమం ద్వారా వెయ్యి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, డ్రోన్లతో అనుమానాస్పద ప్రాంతాల్లో నిఘా పెంచినట్లు చెప్పారు. వీటి వల్ల నేరాలను సమర్థంగా అదుపు చేయగలిగామని వెల్లడించారు. ప్రాపర్టీ రికవరీ 2024లో 51 శాతం నుంచి 2025లో 80 శాతానికి పెరిగిందన్నారు. రోడ్డు ప్రమాదాలు 2024లో 937 ఉండగా 2025లో 738కి తగ్గినట్లు తెలిపారు. సైబర్ నేరాలు, నార్కోటిక్స్ కేసులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని, 2026 నాటికి నేరాలను మరింతగా నియంత్రించడమే లక్ష్యమని సీపీ తెలిపారు.
Andhra Pradesh
Vijayawada Police
Crime Review
CP Rajasekhar Babu
CCTV Surveillance
Drone Monitoring
Suraksha Programme
ప్రాపర్టీ రికవరీ
రోడ్డు ప్రమాదాలు
సైబర్ నేరాలు
నార్కోటిక్స్ కేసులు
Scroll for the next article