Politics17th Jan 05:40 PMSunil Byrisetty1 min read

బీహార్ గెలిచేశాం.. ఇక బెంగాల్ వంతు!

వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఎన్డీయే బెంగాల్ ఎన్నికలపై దృష్టి సారించింది. బీహార్‌లో ఎన్డీయే విజయం సాధించిందని, ఇక పశ్చిమ బెంగాల్‌కు సమయం ఆసన్నమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్ట

బీహార్ గెలిచేశాం.. ఇక బెంగాల్ వంతు!
వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఎన్డీయే బెంగాల్ ఎన్నికలపై దృష్టి సారించింది. బీహార్‌లో ఎన్డీయే విజయం సాధించిందని, ఇక పశ్చిమ బెంగాల్‌కు సమయం ఆసన్నమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. బెంగాల్ పర్యటనలో భాగంగా మాల్దా బహిరంగ సభలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో మమతా బెనర్జీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులను మమతా బెనర్జీ ప్రభుత్వం కొల్లగొడుతోందని ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి హింస, బుజ్జగింపు రాజకీయాలు కావాలని ఆయన విమర్శించారు. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రానికి అసలైన సవాల్ చొరబాటుదారులేనని మోదీ పేర్కొన్నారు. చొరబాట్లను అరికట్టడంలో తృణమూల్ ప్రభుత్వం విఫలమైందని ఆయన దుయ్యబట్టారు.
Indian Politics
NDA
Narendra Modi
Bihar Victory
West Bengal Elections
BJP
Trinamool Congress
Mamata Banerjee
Malda Rally
తృణమూల్ కాంగ్రెస్
మమతా బెనర్జీ
మాల్దా సభ
Scroll for the next article