Politics18th Oct 02:07 PMSunil Byrisetty1 min read

మేం తప్పు చేశాం.. ఎగ్జామినర్ ను స్టూడెంట్ నియమిస్తారా?

ఎగ్జామినర్ ఎంత నిజాయితీపరుడైనా స్టూడెంట్ చేత నియమించబడకూడదు, అలా చేస్తే క్రిటిసిజం ఫేస్ చేయాల్సి వస్తుందని మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ అన్నారు. అందుకే ఎన్నికలను పారదర్శకంగా నిర్వహి

మేం తప్పు చేశాం.. ఎగ్జామినర్ ను స్టూడెంట్ నియమిస్తారా?
ఎగ్జామినర్ ఎంత నిజాయితీపరుడైనా స్టూడెంట్ చేత నియమించబడకూడదు, అలా చేస్తే క్రిటిసిజం ఫేస్ చేయాల్సి వస్తుందని మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ అన్నారు. అందుకే ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు న్యూట్రల్ బాడీ మళ్లీ రావాలన్నారు. లీడర్ ఆఫ్ ద అపోజిషన్, సీజేఐ, అండ్ ప్రైమ్ మినిస్టర్ ముగ్గురూ ఓటు హక్కు వినియోగించుకుని నియమించాలని తెలిపారు. అప్పుడు సీజేఐ న్యూట్రల్ బాడీగా కనిపిస్తారన్నారు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్, ఆయన నియమించే కేంద్ర మంత్రి ఒకవైపు, లీడర్ ఆఫ్ అపోజిషన్ మరోవైపు ఉంటే సీజేఐ పక్కకు పెట్టేశారని పేర్కొన్నారు. ఇది సిస్టంలోని ఫ్లా అన్నారు. తాము కూడా తప్పు చేశాకే గుర్తించామని, ప్రజాస్వామ్యవాదులంతా అడగాలని పేర్కొన్నారు. స్టేట్ ఎలక్షన్ కమిషనర్లో కూడా ఈ రిఫార్మ్ రావాలి, సెంటర్లో మేం అడిగే గత విధానమే రాష్ట్రంలో రావాలని సూచించారు.
Scroll for the next article