News29th Aug 04:00 PMSunil Byrisetty1 min read

భూమాతకు ఏమి చేస్తున్నామని ఆలోచించాలి

హరిత ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనలో భాగంగా ప్రతి ఒక్కరూ పచ్చదనం పెంపునకు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి, వాటి సంరక్షణకు కృషి చేయాలని ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ కొణిదెల నాగబా

భూమాతకు ఏమి చేస్తున్నామని ఆలోచించాలి
హరిత ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనలో భాగంగా ప్రతి ఒక్కరూ పచ్చదనం పెంపునకు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి, వాటి సంరక్షణకు కృషి చేయాలని ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ కొణిదెల నాగబాబు పిలుపునిచ్చారు. మంగళగిరిలోని అరణ్యారామం నందవనంలో సాంప్రదాయ రావి–వేప మొక్కల నాటే కార్యక్రమంలో నాగబాబు, సతీమణి పద్మజతో కలిసి పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నాగబాబు దంపతులు రావి–వేప మొక్కలను నాటారు. “భూమాత మనకు పరోక్షంగా జన్మనిచ్చిన తల్లి. మనం పుట్టినప్పటి నుంచి చివరి శ్వాస వరకు అవసరమైన ఆహారం, నీరు, గాలి, నివాసం వంటి ఎన్నో వనరులను భూమాత నుంచే పొందుతున్నాం. మన తల్లిదండ్రులు మనకు పెట్టే ప్రతి ఆహారపు ముద్ద కూడా భూమాత ప్రసాదించినదే. అలాంటి భూమాతకు తిరిగి మనం ఏమి చేస్తున్నాం అని ప్రతి ఒక్కరు ఆలోచించాలి. అడవులను నరికి వేయడం, విచక్షణారహితంగా మైనింగ్ చేయడం, ప్రకృతిని కాలుష్యం చేయడం ద్వారా మనమే భూమాతను గాయపరుస్తున్నాం. భూమాతను కాపాడటం మన బాధ్యత మాత్రమే కాదు, మన కర్తవ్యమ’’ని పేర్కొన్నారు.
AP Green
Nagababu
Konidela Nagababu
Green Andhra Pradesh
Environment
Mother Earth
Tree Plantation
Afforestation
Environmental Protection
ప్రకృతి సంరక్షణ
మంగళగిరి
అరణ్యారామం
రావి చెట్టు
వేప చెట్టు
హరిత కార్యక్రమం
అడవుల సంరక్షణ
Scroll for the next article