Politics6th Jan 03:40 PMSunil Byrisetty1 min read
మాకు గొడవలు కాదు, నీళ్లు కావాలి
తెలంగాణ ముఖ్యమంత్రి నీటి విషయంలో రాజకీయాలు చేస్తున్నారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఏటా గోదావరి నుంచి 3000 టీఎంసీ నీరు సముద్రంలోకి వృథాగా కలుస్తున్నాయనేది రికార్
తెలంగాణ ముఖ్యమంత్రి నీటి విషయంలో రాజకీయాలు చేస్తున్నారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఏటా గోదావరి నుంచి 3000 టీఎంసీ నీరు సముద్రంలోకి వృథాగా కలుస్తున్నాయనేది రికార్డులు చెబుతున్నాయన్నారు. నదీజలాల విషయంలో కేంద్రం, వాటర్ బోర్డులు ఉంటాయని, వారో మేమో మాట్లాడినంత మాత్రాన సరిపోదని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ దిగువన ఉన్న రాష్ట్రమని, తెలంగాణ ఎగువన ఉన్న రాష్ట్రమని, పై రాష్ట్రం ప్రాజెక్ట్ నిర్మిస్తే కింది రాష్ట్రానికి నష్టం జరుగుతుంది కానీ కింది రాష్ట్రం నిర్మాణం చేసుకుంటే కూడా వ్యతిరేకిస్తూ కోర్టుకెళ్లారని వ్యాఖ్యానించారు. తెలంగాణలో రాజకీయంగా లబ్ధి పొందాలనే ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ మీద, ముఖ్యమంత్రి మీద బురద జల్లుతున్నారని విమర్శించారు. వారికి తెలంగాణ ప్రజల ప్రయోజనాల గురించి కన్నా రాజకీయాల గురించి ఎక్కువ మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో కాళేశ్వరానికి అనుమతులు వచ్చిన విధంగా ఏపీలో పోలవరానికి అనుమతులు వచ్చాయని గుర్తు చేశారు. మీకు నీరు కావాలా, గొడవలు కావాలా అనడిగితే మేం నీళ్లే కావాలని కోరామని గుర్తు చేశారు.