Politics26th Oct 11:19 AMSunil Byrisetty1 min read
'చెప్పాం-చేస్తున్నాం' ముమ్మరం చేయండి
పార్టీ ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. చెప్పాం-చేస్తున్నాం' ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయాలని ఆదేశించారు. మిత్రధర్మ
పార్టీ ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. చెప్పాం-చేస్తున్నాం' ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయాలని ఆదేశించారు. మిత్రధర్మాన్ని పాటించి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. 2024 తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల వేళ ప్రచారానికి ప్రజల వద్దకు వెళ్తున్నామని, అద్భుత విజయం తర్వాత.. ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ వస్తున్నామని వివరించారు. కూటమి అధికారంలోకి వచ్చాక పెద్దఎత్తున అభివృద్ధి, సంక్షేమం చేపట్టామన్నారు. ప్రజలకు ప్రభుత్వ సేవలను సులభతరం చేస్తూ సుపరిపాలన అందిస్తున్నామన్నారు. కూటమి చేపట్టిన మంచి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.