News4th Nov 12:29 PMSunil Byrisetty1 min read

కొఠియా గ్రామ ప్రజలకు అండగా ఉంటాం

కొఠియాలో ఉన్న గిరిజనులను, ఒరిస్సా ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేయడం చాలా దారుణమని మంత్రి సంధ్యారాణి అన్నారు. గిరిజనులను తీసుకెళ్లి దాచేస్తున్నారు… ఇది దుర్మార్గమైన చర్య కాదా అని ప్ర

కొఠియా గ్రామ ప్రజలకు అండగా ఉంటాం
కొఠియాలో ఉన్న గిరిజనులను, ఒరిస్సా ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేయడం చాలా దారుణమని మంత్రి సంధ్యారాణి అన్నారు. గిరిజనులను తీసుకెళ్లి దాచేస్తున్నారు… ఇది దుర్మార్గమైన చర్య కాదా అని ప్రశ్నించారు. గిరిజనుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని, 29 గిరిజన గ్రామాలను చాలా ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. ఎన్నికలను బహిష్కరించాలని గిరిజనులపై ఒత్తిడి తేవడం చాలా బాధాకరమన్నారు. ఎన్నికలను వాయిదా వేయాల్సిన పని ఎలక్షన్ కమిషన్ దన్నారు. ఎన్నికలను బహిష్కరించాలంటూ అభ్యర్థులను బెదిరించడం సరైన పద్ధతి కాదన్నారు. ఆంధ్రప్రదేశ్ అధికారులపై, పోలీసులపై ఒరిస్సా అధికారులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనులు ఓటు వేయడానికి వీల్లేదంటూ ఆంక్షలు విధించడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజనులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
Scroll for the next article