Politics20th Sep 04:14 PMSunil Byrisetty1 min read
పర్యావరణంతోపాటు రాజకీయాల్లోని చెత్తనూ క్లీన్ చేస్తాం
రాష్ట్రంలో పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు చెత్తను శుభ్రం చేసినట్లుగానే, సమాజం సంతోషంగా ఉండాలంటే రాజకీయాల్లోని చెత్తనూ క్లీన్ చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు న
రాష్ట్రంలో పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు చెత్తను శుభ్రం చేసినట్లుగానే, సమాజం సంతోషంగా ఉండాలంటే రాజకీయాల్లోని చెత్తనూ క్లీన్ చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆ పనిని కూటమి ప్రభుత్వం చేస్తుందని స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా మాచర్లలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు శనివారం స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాచర్లలో గతంలో ప్రజాస్వామ్యం లేని పరిస్థితులను, రౌడీయిజం, నేరాలు, అరాచకాలను గుర్తు చేస్తూ, ఇకపై అలాంటి చర్యలను సహించబోమని హెచ్చరించారు. "ప్రజలపై దాడులు, ఆస్తులపై దౌర్జన్యాలు చేసేవారిని ఉపేక్షించను. రాయలసీమలో ముఠాలను అదుపు చేసినట్లే, పల్నాడులోనూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నా," అని ఆయన అన్నారు.