Education21st Jul 11:02 AMSunil Byrisetty1 min read

ప్రభుత్వ పాఠశాలలను చూసి అసూయపడేలా చేస్తాం

ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యమని, ప్రభుత్వ పాఠశాలలను చూసి అసూయపడేలా చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. తల్లికి వందనం పథకం లబ్ధిదారులైన విద్యార్థుల తల్లులతో లోక

ప్రభుత్వ పాఠశాలలను చూసి అసూయపడేలా చేస్తాం
ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యమని, ప్రభుత్వ పాఠశాలలను చూసి అసూయపడేలా చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. తల్లికి వందనం పథకం లబ్ధిదారులైన విద్యార్థుల తల్లులతో లోకేష్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లికి వందనం పథకం అందుతున్న తీరు, తల్లికి వందనం కింద ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం ఏ విధంగా ఉపయోగపడుతోందనే విషయాలపై మంత్రి ఆరా తీశారు. విద్యార్థుల తల్లుల నుంచి పలు సలహాలు, సూచనలు స్వీకరించారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తోంది. గతంలో ప్రైవేటు పాఠశాలలను చూసి అసూయపడేవాళ్లం. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలను చూసి ప్రైవేటు పాఠశాలలు అసూయపడేలా చేస్తాం. ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలల నుంచి 1,06,000 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు తరలివచ్చారని మంత్రి అన్నారు.
Andhra Pradesh
School Education
Public Education
Nara Lokesh
Government Schools
Thalliki Vandanam
ప్రభుత్వ విద్య
విద్యా సంస్కరణలు
ఏపీ ప్రభుత్వం
Scroll for the next article