News22nd Nov 03:12 PMSunil Byrisetty1 min read
రైతులకు అన్యాయం జరగనివ్వం
రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనివ్వబోమని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఈ రోజు ఉదయం జరిగిన సీఆర్డీఏ సమావేశంలో మంత్రి ఈ
రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనివ్వబోమని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఈ రోజు ఉదయం జరిగిన సీఆర్డీఏ సమావేశంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై సీఆర్డీఏ కార్యాలయంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, పురపాలక శాఖ మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ల త్రిసభ్య కమిటీ సమావేశమైంది. సమావేశంలో రైతు జేఏసీ ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులు లేవనెత్తిన పలు అంశాలపై చర్చ జరిగింది. వాటి పరిష్కారం కోసం కమిటీ సమాలోచనలు చేసింది. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. ఏ రైతుకూ ఇబ్బంది లేకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రాజధానిలో పెండింగ్ లో ఉన్న జరీబు భూముల సమస్యకు 30 రోజుల్లో పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. గ్రామ కంఠాలు, లంక భూముల సమస్యలనూ పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు.