News8th Aug 05:12 PMSunil Byrisetty1 min read

అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమం

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. టెక్కలి నియోజకవర్గం నిమ్మాడ క్యాంప్ కా

అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమం
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. టెక్కలి నియోజకవర్గం నిమ్మాడ క్యాంప్ కార్యాలయంలో ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.ప్ర‌జా స‌మ‌స్య‌లు ప‌రిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఉద్యోగ ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించాల‌ని విన‌తులు అందాయి. నూత‌న పింఛన్లు మంజూరు చేయాల‌ని, నూత‌న గృహాలు మంజూరు చేయాల‌ని ప్ర‌జ‌ల నుంచి పెద్దఎత్తున వినతులు అందుతున్నాయి.త్వరలో మంజూరు చేయడం జరుగుతుందని ప్రజలకు వివరించారు.ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చిన విన‌తులను ప‌రిశీలించి సంబంధిత అధికారుల‌తో ఫోన్ చేసి మాట్లాడి త్వ‌రితగ‌తిన ప్ర‌జ‌ల‌కు మేలు చేసేవిధంగా స‌త్వ‌ర చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. విధుల‌లో అల‌స‌త్వం లేకుండా అధికారులు ప‌నిచేయాల‌ని సూచించారు.
Andhra Pradesh
Welfare schemes
Election promises
Agriculture Minister
Kinjarapu Atchannaidu
Tekkal constituency
New pensions
సంక్షేమ పథకాలు
ప్రజా సంక్షేమం
కింజరాపు అచ్చెన్నాయుడు
Scroll for the next article