News9th Oct 04:40 PMSunil Byrisetty1 min read
సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూనే బీసీలకు అండ
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే విషయంలో తెలుగుదేశం పార్టీతో పాటు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, చట్టపరంగా చేయలేక పోయినప్పటికీ పార్టీ పరంగా 34 శాతం రిజర్వేషన్ అమలు
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే విషయంలో తెలుగుదేశం పార్టీతో పాటు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, చట్టపరంగా చేయలేక పోయినప్పటికీ పార్టీ పరంగా 34 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూనే బీసీల హక్కుల పరిరక్షణకు, వారి సామాజిక, ఆర్థిక, రాజకీయ అభ్యున్నతికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడటం, వారికి న్యాయం చేయడం కూటమి లక్ష్యమని తెలిపారు. తెలుగుదేశం పార్టీ హయాంలో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లు అమలులో ఉండగా, వైసీపీ ప్రభుత్వం వాటిని 24 శాతానికి తగ్గించిందని విమర్శించారు. బీసీలకు జరిగిన అన్యాయంపై వైసీపీ గొడ్డలి పార్టీ ప్రభుత్వం కనీసం న్యాయపోరాటం కూడా చేయలేదని ఆరోపించారు. అప్పట్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు వైసిపి అవసరమైన చర్యలు తీసుకోలేదన్నారు. గత వైసిపి పాలనలో 16,800 మంది బీసీలు పదవులు దక్కకుండా కోల్పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.