News15th Aug 10:00 AMSunil Byrisetty2 min read
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి చర్యలు
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల జర
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల జర్నలిస్టులు ఇప్పటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జర్నలిస్టుల సంక్షేమ పథకాలను తక్షణమే అమలు చేయాలని, ఆగస్టు 30 లోపల నూతన అక్రిడేషన్ మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షులు పి. శివ రాజేష్ నేతృత్వంలోనీ బృందం మంత్రి పార్థసారధికి వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టుల ఆరోగ్య బీమా పరిమితి రెండు లక్షల నుంచి పది లక్షలకు పెంచాలని, జర్నలిస్టుల హెల్త్ కార్డులు అన్ని కార్పొరేట్ హాస్పిటల్లో చలామణి అయ్యేవిధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. సీఎం చంద్రబాబు గత ప్రభుత్వంలో ఏపీజేఎఫ్ చొరవతో అమలులోకి వచ్చిన జర్నలిస్ట్ బీమా పథకాన్ని 10 లక్షలు నుంచి 20 లక్షలకు పెంచి తక్షణమే అమలు చేయాలని, 20 సంవత్సరాలు దాటిన పాత్రికేయులకు వివిధ రాష్ట్రాలలో అమలులో ఉన్న విధంగా 15,000 పెన్షన్ మంజూరు చేయాలని, జర్నలిస్టు వెల్ఫేర్ ఫండ్ కు 100 కోట్లు కేటాయించి పాత్రికేయ మిత్రులకు భరోసా కల్పించాలని కోరారు. గత చంద్రబాబు ప్రభుత్వంలో జర్నలిస్టు వ్యవస్థలపై వచ్చిన జీవోను పున పరిశీలించి జర్నలిస్టుల ఇంటి నిర్మాణ కలను సాకారం చేయాలని, జర్నలిస్టులకు వేజ్ బోర్డుపై కేంద్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకునే విధంగా చూడాలని ఏపీజేఎఫ్ నేతలు మంత్రిని కోరారు. జర్నలిస్టుల పెన్షన్ ఇళ్ల నిర్మాణం పథకాలు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిలో ఉన్నాయని, వాటిని అందించేందుకు కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీజేఎఫ్ రాష్ట్ర కోశాధికారి గాంధీ బాబు,ఏపీజేఎఫ్ ఎలక్ట్రానిక్ మీడియా విభాగం రాష్ట్ర అధ్యక్షులు మద్దినేని అనిల్, పాత్రికేయులు పాల్గొన్నారు.