Politics19th Oct 05:39 PMSunil Byrisetty1 min read

వైసీపీ రౌడీయిజానికి భయపడనన్న ఎంపీ

నంద్యాలలో ఇప్పటివరకు నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా సాగిందని, అయితే సోమవారం నామినేషన్ల పరిశీలన సమయంలో తమ అభ్యర్థిపై దాడి జరగడం బాధాకరమని నంద్యాల ఎంపీ డా. బైరెడ్డి శబరి అన్నారు. నామ

వైసీపీ రౌడీయిజానికి భయపడనన్న ఎంపీ
నంద్యాలలో ఇప్పటివరకు నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా సాగిందని, అయితే సోమవారం నామినేషన్ల పరిశీలన సమయంలో తమ అభ్యర్థిపై దాడి జరగడం బాధాకరమని నంద్యాల ఎంపీ డా. బైరెడ్డి శబరి అన్నారు. నామినేషన్ల పరిశీలన సమయంలో వైసీపీ నాయకులు కొందరిని లోపలికి తీసుకువచ్చి టీడీపీ అభ్యర్థుల నామినేషన్లపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. తాము కూడా వైసీపీ అభ్యర్థులపై అభ్యంతరాలు వ్యక్తం చేయగలమని, అయితే ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా జరగాలనే ఉద్దేశంతో సంయమనం పాటించామని తెలిపారు. గొడవలకు తావివ్వకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని తాము భావించామని, అయినప్పటికీ తమ అభ్యర్థిపై దాడి జరిగిందని ఎంపీ శబరి ఆరోపించారు. రౌడీయిజం చేస్తే భయపడతామని ఎవరూ అనుకోవద్దని, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలను ఎదుర్కోవాలని స్పష్టం చేశారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో తనపైనా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారని ఆమె గుర్తుచేశారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సంయమనం పాటిస్తూ, ఎన్నికలు న్యాయబద్ధంగా జరగాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.
Scroll for the next article