News20th Nov 03:48 PMSunil Byrisetty1 min read

హెల్మెట్ ధరించు.. స్వీట్ తిను!

సహజంగా రోడ్డు మీద హెల్మెట్ పెట్టుకుని వెళ్లే వాహనదారులను ఆపి ఎవరు స్వీట్లు పెట్టరు. కానీ బాపట్ల జిల్లా కర్లపాలెం పోలీసులు సత్యవతి పేట వద్ద రహదారి నిబంధనలు పాటిస్తూ హెల్మెట్ పెట్టుక

హెల్మెట్ ధరించు.. స్వీట్ తిను!
సహజంగా రోడ్డు మీద హెల్మెట్ పెట్టుకుని వెళ్లే వాహనదారులను ఆపి ఎవరు స్వీట్లు పెట్టరు. కానీ బాపట్ల జిల్లా కర్లపాలెం పోలీసులు సత్యవతి పేట వద్ద రహదారి నిబంధనలు పాటిస్తూ హెల్మెట్ పెట్టుకుని ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వారిని ఆపి వారికి మిఠాయిలు తినిపించి ఎంతో మందికి ఆదర్శంగా ఉంటున్నందుకు అభినందించారు. అదేవిధంగా హెల్మెట్ ధరించని వారిని ఆపి హెల్మెట్ ధరించకపోతే కలిగే నష్టాలను వివరిస్తూ వారికి ఫైన్ విధించారు. మొత్తం మీద పోలీసులు వాహనదారులకు స్వీట్ పెట్టడం పట్ల వాహనదారులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కర్లపాలెం ఎస్సై రవీంద్ర మాట్లాడుతూ రహదారి నియమాలను పాటించేవారిని తాము ఎప్పుడు గౌరవిస్తామని, అలాంటి వారి నోరు తీపి చేస్తే మరో 10 మంది పాటిస్తారని ఉద్దేశం అన్నారు. మొత్తం మీద హెల్మెట్ పెట్టుకున్న వారికి నోట్లోకి స్వీట్ వచ్చింది. పెట్టుకోని వారికి ఫైన్ వచ్చింది.
Andhra Pradesh News
Bapatla District
Karalpale Police
Helmet Awareness
Road Safety Campaign
Safe Driving
Traffic Rules
పోలీసుల ప్రత్యేక కార్యక్రమం
హెల్మెట్ డ్రైవింగ్
ట్రాఫిక్ ఫైన్
Scroll for the next article