TTD17th Sep 05:28 PMSunil Byrisetty1 min read
తిరుమలలో “ట్యాగ్ కట్టుకోండి.. మీ భద్రత మా బాధ్యత”
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు నేతృత్వంలో భక్తుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ పటిష్ట బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. పెద్ద సంఖ్యలో
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు నేతృత్వంలో భక్తుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ పటిష్ట బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు కుటుంబ సభ్యుల నుంచి విడిపోకుండా, తప్పిపోకుండా ప్రత్యేక ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా భక్తుల రద్దీ అధికంగా ఉండే నడక మార్గాలు, నాలుగు మాడ వీధులు, గ్యాలరీలు, బస్టాండ్లు, చౌల్ట్రీలు, విశ్రాంతి భవనాలు, ప్రధాన రద్దీ ప్రాంతాల వద్ద పోలీసులు ప్రత్యేకంగా అప్రమత్తంగా ఉంటున్నారు. చిన్నారులు, వృద్ధులకు జియో ట్యాగ్‌లు ఏర్పాటు చేసి, వారు కుటుంబ సభ్యుల నుంచి విడిపోయిన సందర్భంలో త్వరగా గుర్తించి, వారి కుటుంబ సభ్యుల వద్దకు సురక్షితంగా చేర్చేలా చర్యలు చేపడుతున్నారు. “ట్యాగ్ కట్టుకోండి.. మీ భద్రత మా బాధ్యత” అనే సందేశంతో భక్తులకు అవగాహన కల్పిస్తూ చిన్నారులు, వృద్ధులకు ట్యాగ్‌లు ధరింపజేస్తున్నారు.