News21st Jul 09:18 AMSunil Byrisetty1 min read

ఏపీలో వారమంతా వర్షాలే!

ఏపీలో వర్ష ప్రభావం కొనసాగుతోంది. పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో.. ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో ఆదివారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అలాగే 23న బుధవారం ఉత్తర బంగాళాఖాతంల

ఏపీలో వారమంతా వర్షాలే!
ఏపీలో వర్ష ప్రభావం కొనసాగుతోంది. పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో.. ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో ఆదివారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అలాగే 23న బుధవారం ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. దీంతో రాబోయే ఐదు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. సోమవారం విశాఖ, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కొన్నిచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Andhra Pradesh Weather
AP Rain Forecast
Heavy Rain Alert
Cyclonic Circulation Bay of Bengal
AP District Rainfall
IMD Weather Warning
బంగాళాఖాతం అల్పపీడనం
కోస్తా ఆంధ్ర వర్షాలు
Scroll for the next article