News20th Jan 05:24 PMSunil Byrisetty1 min read

ఫిబ్రవరి నుంచి పెళ్లి సందడి..!!

2026లో పెళ్లిళ్లకు అద్భుతమైన ముహూర్తాల జాబితా విడుదలైంది. జ్యోతిష్యం ప్రకారం గురువు, శుక్రుడు ముహూర్తాలకు కారకులు. ఈ రెండు సూర్యుడితో కలుస్తుండటంతో మౌఢ్యమి అవుతుంది. జనవరిలో ముహూర్

ఫిబ్రవరి నుంచి పెళ్లి సందడి..!!
2026లో పెళ్లిళ్లకు అద్భుతమైన ముహూర్తాల జాబితా విడుదలైంది. జ్యోతిష్యం ప్రకారం గురువు, శుక్రుడు ముహూర్తాలకు కారకులు. ఈ రెండు సూర్యుడితో కలుస్తుండటంతో మౌఢ్యమి అవుతుంది. జనవరిలో ముహూర్తాలు లేవు. ఫిబ్రవరి 14 తర్వాతే ముహూర్తాలు ప్రారంభమవుతాయి. అదే నెల 19 నుంచి మంచి ముహూర్తాలున్నాయి. ఫిబ్రవరి నెలలో 19, 20,21,22,24,25,26 తేదీల్లో మంచి ముహూర్తాలున్నాయి. మార్చి నెలలో 4, 5,6,7,8,11,12,13,14,20,21,25,29 తేదీల్లో, ఏప్రిల్ నెలలో 1,2,3,4,5,6,7,8,10,11,12,26,28,29,30 తేదీల్లో, మే నెలలో 1, 3,5,6,7,8,9,10,12,13 తేదీల్లో మంచి ముహూర్తాలున్నాయి. అధిక జ్యేష్ఠ మాసం కారణంగా మే 18 నుంచి జూన్ 11 వరకు ముహూర్తాలు లేవు. తర్వాత జూన్ 19,20,21,24,25,27,28 తేదీల్లో, జూలై 1,2,3,4,5,8,9 తేదీల్లో, ఆగష్టులో 16,18,20,21,22,23,24,25,26,27,28,30, సెప్టెంబర్ నెలలో 1,3,4,5 తేదీల్లో, అక్టోబర్ నెలలో 11,14,29,30, నవంబర్ కార్తీక మాసంలో 11, 13, 14, 18, 19, 20, 21, 22,24,25,26 తేదీల్లో, డిసెంబర్ 2, 3, 10, 12, 13, 15, 16, 17, 18, 19, 22, 23, 27, 29,31 తేదీల్లో వివాహా శుభ ముహూర్తాలున్నాయని పండితులు చెబుతున్నారు.
Wedding Muhurthams 2026
Marriage Dates
Auspicious Days
Hindu Astrology
Wedding Season
February Weddings
Guru Shukra Combustion
Jyestha Masam
Kartika Masam
Scroll for the next article