Life Style10th Aug 02:07 PMSunil Byrisetty1 min read
గొప్పలకు పోతే అప్పులే మిగులు!
శుభకార్యాలు కోట్ల ఖర్చుకు కేరాఫ్ గా మారాయి. గతంలో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు బంధువులు సహకరించేవారు. దీంతో పెద్దగా ఖర్చు ఉండేది కాదు. పెళ్లి కొడుక్కి అమ్మాయి తరపు వారు తమ స్తోమత మ
శుభకార్యాలు కోట్ల ఖర్చుకు కేరాఫ్ గా మారాయి. గతంలో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు బంధువులు సహకరించేవారు. దీంతో పెద్దగా ఖర్చు ఉండేది కాదు. పెళ్లి కొడుక్కి అమ్మాయి తరపు వారు తమ స్తోమత మేరకు కట్నకానుకలు ఇచ్చేవారు. ఇప్పుడు కట్నకానుకల సంగతి చెప్పనలవి కాదు. పెళ్లి కుదిరి నిశ్చితార్థం జరగకముందే ఫంక్షన్ హాళ్లను వెతకాల్సిన పరిస్థితి. అనుకూలమైన హాల్ దొరికితే.. ఆయా తేదీల్లోనే ముహూర్తాలు పెట్టుకుంటున్నారు. హాళ్లకు రూ.లక్షలు వెచ్చిస్తున్నారు.
భోజనాలకు రూ. లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఫంక్షన్ హాళ్లు, వివాహ వేదిక, డెకరేషన్, మేళతాళం, ఫొటో, వీడియోగ్రఫీ, ఆఖరుకు భోజనాలు.. ఇలా అన్నింటికీ అడ్డగోలుగా ఖర్చు చేస్తున్నారు. స్టేటస్ కోసం, నలుగురిలో తాము తక్కువ కాకూడదని అప్పులు చేసి మరీ పెళ్లిళ్లు చేసి అప్పులపాలవుతున్నారు. ఫంక్షన్ హాల్ అద్దె, పెళ్లి మండపాలకు ఎక్కువ మొత్తంలో ఖర్చవుతున్నాయి. దీంతో కుటుంబాలు అప్పులపాలవుతున్నాయి. పెళ్లిళ్ల కోసం, చేసిన అప్పులు తీర్చడం కోసం ఆస్తులు అమ్ముకున్నారు.