News22nd Jul 05:47 PMSunil Byrisetty1 min read

ఆర్థిక ఇబ్బందులు ఉన్న సంక్షేమ పథకాలు

ఏపీలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అత్యధిక నిధులను కేటాయిస్తుందని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) తెల

ఆర్థిక ఇబ్బందులు ఉన్న సంక్షేమ పథకాలు
ఏపీలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అత్యధిక నిధులను కేటాయిస్తుందని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) తెలిపారు. భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను 61 మందికి రూ 33.98 లక్షలను 24 మందికి ఎల్. ఓ.సీ( లెటర్ ఆఫ్ క్రెడిట్ పత్రాలను) కూటమి నేతలతో కలిసి 85 మంది లబ్ధిదారులకు రూ 74 లక్షల 8 వేలను అందజేశారు. సుజనా మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగిందని రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. వైసీపీ విధ్వంస పాలనను తిరిగి గాడిలో పెట్టడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు. ఎన్నికల వరకే రాజకీయాలని ప్రజలకు సేవ చేయడానికి ప్రజా ప్రతినిధులందరం ఐక్యంగా కలిసి పనిచేయాలన్నారు. రాజకీయాలకతీతంగా, కులమతాలకతీతంగా చిత్తశుద్ధితో పశ్చిమ ప్రజలకు సేవలందించడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సుజనా మిత్ర కో ఆర్డినేటర్లను నియమించడం జరిగిందని ప్రతి ఒక్కరు వారి సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Andhra Pradesh
NDA Government
Welfare Schemes
Financial Issues
Yalamanchili Satyanarayana
Sujana Chowdary
CM Relief Fund
Chandrababu Naidu
ఆర్థిక ఇబ్బందులు ఉన్న సంక్షేమ పథకాలు
Scroll for the next article