Politics7th Mar 09:28 AMSunil Byrisetty1 min read

పెన్షన్ సొమ్ముతో పరారై.. సెల్ఫీ వీడియో!

పెన్షన్ సొమ్ముతో పరారైన ఓ సచివాలయ ఉద్యోగి తప్పు తెలుసుకుని నెలలో తిరిగిస్తానని సెల్ఫీ వీడియోలో కోరాడు. పల్నాడు జిల్లా దాచేపల్లిలో సచివాలయం -3 వెల్ఫేర్ అసిస్టెంట్ సంపతి లక్ష్మీ ప్రస

పెన్షన్ సొమ్ముతో పరారై.. సెల్ఫీ వీడియో!
పెన్షన్ సొమ్ముతో పరారైన ఓ సచివాలయ ఉద్యోగి తప్పు తెలుసుకుని నెలలో తిరిగిస్తానని సెల్ఫీ వీడియోలో కోరాడు. పల్నాడు జిల్లా దాచేపల్లిలో సచివాలయం -3 వెల్ఫేర్ అసిస్టెంట్ సంపతి లక్ష్మీ ప్రసాద్ ఒకటో తేదీన పంపిణీ చేయాల్సిన రూ. 11 లక్షల 12500 సొమ్మును తీసుకుని ఉడాయించాడు. దీనిపై దాచేపల్లి కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఏమైందో కానీ లక్ష్మీప్రసాద్ సెల్ఫీ వీడియో ద్వారా తప్పును ఒప్పుకున్నాడు. ఆన్లైన్ బెట్టింగుల్లో డబ్బు పోగొట్టుకొన్నానని, నెల గడువిస్తే ఆ నగదు తిరిగి చెల్లిస్తానని చెప్పాడు. ఆత్మహత్యకు కూడా సిద్ధపడ్డామని ఒక్క అవకాశం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ దాచేపల్లి కమిషనర్ లను ప్రాధేయపడ్డాడు.
Andhra Pradesh
Welfare Secretariat
Pension
ఆంధ్రప్రదేశ్
సంక్షేమ సచివాలయం
పెన్షన్
Scroll for the next article