News16th Apr 06:24 PMSunil Byrisetty1 min read
బంగాల్ రాష్ట్రం.. చట్టం, రాజ్యాంగం అక్కడ పని చేయవా?
పశ్చిమ బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీరుపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజ్యాంగానికి, చట్టాలకు, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాలపై తీవ్ర వ
పశ్చిమ బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీరుపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాజ్యాంగానికి, చట్టాలకు, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
అంతే కాకుండా ఏకంగా సుప్రీంకోర్టు 25 వేల మంది టీచర్ల నియామకాలను రద్దు చేయాలని తీర్పునివ్వగా..
దాన్ని సైతం అమలు చేయబోనంటూ వ్యాఖ్యానించడం వివాదాస్పదంగా మారింది.
వక్ఫ్ సవరణ చట్టంపై పార్లమెంట్ ఉభయ సభల్లో బిల్లు పాస్ కాగా..
తాను మాత్రం బంగాల్‌లో అమలు చేయనంటూ, మరోవైపు ముస్లింల నిరసనలను ప్రోత్సహించడం విమర్శలకు కారణమవుతోంది.
కోట్ల రూపాయల లంచాలు తీసుకుని ఉపాధ్యాయ ఉద్యోగాలు అమ్ముకోవడంతో సుప్రీంకోర్టు సైతం విచారణ జరిపింది.
పరీక్షల జవాబు పత్రాలను చూపమని కోరగా లేవనడంపై సర్వోన్నత న్యాయస్థానం విస్మయం వ్యక్తం చేసింది.
25 వేల ఉపాధ్యాయుల నియామకాలను రద్దు చేస్తూ సుప్రీం తీర్పునిచ్చింది. ఆరు నెలల్లో మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది.
అయినప్పటికీ తాము వారందరినీ కాపాడుకుంటామని, ఉద్యోగాల్లో కొనసాగగాలని మమత చెప్పడం దేశవ్యాప్త విమర్శలకు కారణమయ్యాయి.
ఇదే విధానాన్ని వక్ఫ్ సవరణ బిల్లు విషయంలోనూ మమత, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వ్యవహరించడం ఆందోళన కలిగిస్తోంది.
ఇలా రాజ్యాంగం, చట్టాలకు వ్యతిరేకంగా వ్యవహరించే ముఖ్యమంత్రులను తొలగించి, రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.
వక్ఫ్ ఆందోళనలు హింసాత్మకం కావడంతో మమత వ్యవహారశైలిపై ఆ రాష్ట్ర హైకోర్టు సైతం సీరియస్ అయి, కేంద్ర బలగాలను దించినా, సుప్రీంకోర్టు మాత్రం జోక్యం చేసుకోలేదు. పరిశ్రమలు, పెట్టుబడుల విషయంలోనూ మమత నిరంకుశంగా వ్యవహరించడంతో టాటా, డన్‌లప్ వంటి పారిశ్రామిక దిగ్గజాలు బంగాల్‌ను విడిచి వెళ్లాయి.
అయినా విదేశాల్లో మమత పారిశ్రామిక అనుకూల రాష్ట్రమంటూ డప్పు కొట్టుకుంటున్నారు.
మొత్తంగా మమత తీరుపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది.