News1st Sep 05:21 PMSunil Byrisetty1 min read

నాటి ముంపు నుంచి నేర్చుకున్నదేంటి?

2024లో ఇదే రోజున బుడమేరు పొంగి విజయవాడను ముంచేసింది. వేలాది ఇళ్లు నీట మునిగాయి. వెంటనే ప్రభుత్వం అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టడంతోపాటు ముంపు నివారణకు శాశ్వత చర్యలు చేపడతామని హామీ

నాటి ముంపు నుంచి నేర్చుకున్నదేంటి?
2024లో ఇదే రోజున బుడమేరు పొంగి విజయవాడను ముంచేసింది. వేలాది ఇళ్లు నీట మునిగాయి. వెంటనే ప్రభుత్వం అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టడంతోపాటు ముంపు నివారణకు శాశ్వత చర్యలు చేపడతామని హామీ ఇచ్చింది. అయితే ఆ హామీని నిలబెట్టుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్‌. బాబూరావు విమర్శించారు. 2024 ఆగస్టు 31 అర్ధరాత్రి సంభవించిన బుడమేరు వరదలకు రెండేళ్లు పూర్తయిన సందర్భంగా విజయవాడ బుడమేరు వంతెన వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రూ.5,222 కోట్లతో అధికారులు రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను ప్రభుత్వం ఇప్పటికైనా ఆమోదించి నిధులు విడుదల చేయాలని బాబూరావు డిమాండ్‌ చేశారు. కొల్లేరు వరకు బుడమేరును లోతు, వెడల్పు చేయడంతో పాటు విజయవాడ సమీపంలో సమాంతర కాలువ నిర్మాణం చేపట్టాలని కోరారు. 2024 వరదల్లో పెద్దఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం జరిగినప్పటికీ ప్రభుత్వం శాశ్వత పరిష్కారంపై తగిన దృష్టి పెట్టలేదని బాబూరావు ఆరోపించారు. స్వల్ప వర్షానికే బుడమేరు పరివాహక ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు.
Andhra Pradesh Politics
Budameru Floods
Budameru Flood
Vijayawada Floods
Vijayawada
CPM
C H Baburao
AP Government
Coalition Government
సమగ్ర ప్రాజెక్టు నివేదిక
కొల్లేరు
సమాంతర కాలువ
వరద ముంపు
విజయవాడ ప్రజలు
Scroll for the next article