News21st Apr 10:41 AMSunil Byrisetty1 min read

వాట్సాప్‌ వాడుతున్నారా.. ఈ వార్నింగ్‌ మీకే!

కేంద్ర ప్రభుత్వం వాట్సాప్ వినియోగదారులకు వార్నింగ్ ఇచ్చింది. వాట్సాప్ డెస్క్‌టాప్ వెర్షన్‌ను ఉపయోగిస్తున్న యూజర్లు సైతం డేంజర్‌లో ఉన్నారంటూ హెచ్చరికలు చేసింది. డెస్క్‌టాప్‌ కంప్యూట

వాట్సాప్‌ వాడుతున్నారా.. ఈ వార్నింగ్‌ మీకే!
కేంద్ర ప్రభుత్వం వాట్సాప్ వినియోగదారులకు వార్నింగ్ ఇచ్చింది. వాట్సాప్ డెస్క్‌టాప్ వెర్షన్‌ను ఉపయోగిస్తున్న యూజర్లు సైతం డేంజర్‌లో ఉన్నారంటూ హెచ్చరికలు చేసింది. డెస్క్‌టాప్‌ కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌లో వాట్సాప్‌ను నడుపుతున్న యూజర్లు.. డెస్క్‌టాప్ వెర్షన్ 2.2450.6 కంటే పాత వెర్షన్‌ వాడుతున్నట్లయితే ఆయా యూజర్ల సిస్టమ్స్‌ హ్యాకర్ల దాడికి గురయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది. బగ్ కారణంగా, హ్యాకర్లు మీ డివైజ్‌ను వాట్సాప్‌ యాప్‌ సహాయంతో యాక్సెస్‌ చేసే ఛాన్స్‌ ఉందని సెర్ట్‌ తెలిపింది. వాట్సాప్ డెస్క్‌టాప్ అప్లికేషన్‌ సెక్యూరిటీ పరంగా బలహీనంగా ఉందని పేర్కొంది. ఇది ఫైల్‌ ఓపెనింగ్‌ ప్రాసెస్‌కు సంబంధించిందని.. ఎంఐఎంఈ రకం, ఫైల్‌ ఎక్స్‌టెన్షన్‌ మధ్య సరిపోలకపోవడం కారణంగా.. వాట్సాప్‌ కొన్ని అటాచ్‌మెంట్స్‌ని సరిగ్గా గుర్తించలేకపోతుందని.. ఈ టెక్నికల్‌ వీక్‌నెస్‌ని సద్వినియోగం చేసుకొని హ్యాకర్స్‌ మీ కంప్యూటర్లలోకి వైరస్‌ను చొప్పించే ప్రమాదం ఉందని ప్రకటించింది.
central government
WhatsApp Users Alert
hacked
డెస్క్‌టాప్ వెర్షన్‌ సైతం డేంజర్‌
ఫైల్‌ ఎక్స్‌టెన్షన్‌
Scroll for the next article