electronics-mobiles-tablets25th Jul 01:05 PMSunil Byrisetty1 min read

ఐపాడ్ వాడుతున్నారా.. ఫోన్ లేకుండా సైన్అప్

ఐపాడ్ యూజర్ల కోసం వాట్సాప్ ఒక బిగ్ అప్‌డేట్‌ను తెచ్చింది. ఇప్పటి వరకు ఐపాడ్లో వాట్సాప్ వాడాలంటే దాన్ని కచ్చితంగా స్మార్ట్‌ఫోన్‌కు లింక్ చేసి, దాన్ని సెకండరీ డివైజ్‌గా మాత్రమే ఉపయోగ

ఐపాడ్ వాడుతున్నారా.. ఫోన్ లేకుండా సైన్అప్
ఐపాడ్ యూజర్ల కోసం వాట్సాప్ ఒక బిగ్ అప్‌డేట్‌ను తెచ్చింది. ఇప్పటి వరకు ఐపాడ్లో వాట్సాప్ వాడాలంటే దాన్ని కచ్చితంగా స్మార్ట్‌ఫోన్‌కు లింక్ చేసి, దాన్ని సెకండరీ డివైజ్‌గా మాత్రమే ఉపయోగించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ అవసరం లేకుండా, ఐపాడ్ లోనే నేరుగా కొత్త వాట్సాప్ ఖాతాను క్రియేట్ చేసుకునే వెసులుబాటును వాట్సాప్ కల్పించింది. అంటే ఇకపై ఐపాడ్ ను సైతం ఒక ప్రైమరీ డివైజ్‌గా వాడుకోవచ్చు. దీనికి తోడు మరికొన్ని అద్భుతమైన ఫీచర్లను కూడా యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. ఇన్నాళ్లూ ఐపాడ్ యూజర్లు వాట్సాప్ వాడాలంటే మొదట ఫోన్‌లో అకౌంట్ ఉండి, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సెకండరీ డివైజ్‌గా కనెక్ట్ చేసుకోవాల్సి వచ్చేది. ఫోన్ అందుబాటులో లేకపోతే లేదా ఆఫ్ అయిపోతే ఇబ్బందులు ఎదురయ్యేవి. ఈ కొత్త అప్‌డేట్‌తో ఐపాడ్ OS యూజర్లు నేరుగా తమ ఐపాడ్లోనే మొబైల్ నంబర్ ఎంటర్ చేసి, ఓటీపీ ద్వారా కొత్త అకౌంట్‌ను ప్రారంభించవచ్చు.
Digital Technology
WhatsApp
iPad
Apple
WhatsApp Update
iPadOS
Meta
Messaging App
Tech News
Mobile Apps
Standalone Sign-Up
OTP Verification
Scroll for the next article