Technology20th Oct 04:17 PMSunil Byrisetty1 min read
వాట్సాప్‌లో కొత్త ఫీచర్!
వాట్సాప్ తన యూజర్లకు అనవసరమైన, స్పామ్ సందేశాల నుంచి ఉపశమనం కలిగించేందుకు కీలకమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. కాంటాక్ట్ లిస్టులో లేని, పంపిన మెసేజ్‌లకు స్పందించని నంబర్లకు సందేశాల
వాట్సాప్ తన యూజర్లకు అనవసరమైన, స్పామ్ సందేశాల నుంచి ఉపశమనం కలిగించేందుకు కీలకమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. కాంటాక్ట్ లిస్టులో లేని, పంపిన మెసేజ్‌లకు స్పందించని నంబర్లకు సందేశాలు పంపడంపై నెలవారీ పరిమితి విధించే కొత్త ఫీచర్‌ను ప్రస్తుతం పరీక్షిస్తోంది. ఈ చర్యతో యూజర్ల ఇన్‌బాక్స్‌ను ప్రశాంతంగా, క్లీన్‌గా ఉంచాలని, వ్యక్తిగత సంభాషణలకు పెద్దపీట వేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
కొన్నేళ్లుగా వాట్సాప్ చాటింగ్ యాప్‌గానే కాకుండా కమ్యూనిటీలు, బిజినెస్ అకౌంట్లు, కస్టమర్ సర్వీస్ వంటి సేవలతో విస్తరించింది. అయితే, ఈ విస్తరణతో పాటే అనవసర ప్రమోషనల్, స్పామ్ మెసేజ్‌ల బెడద కూడా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో టెక్‌క్రంచ్ నివేదిక ప్రకారం వాట్సాప్ ఈ కొత్త పరిమితిని తీసుకురానుంది. కాంటాక్ట్ లిస్టులో లేని ఒక వ్యక్తికి మూడుసార్లు మెసేజ్ పంపినా వారు స్పందించకపోతే, పంపినవారి నెలవారీ కోటా నుంచి మూడు మెసేజ్‌లు తగ్గుతాయి.