Politics24th Aug 04:31 PMSunil Byrisetty1 min read
యాంటీ రిలీజియస్ కన్వర్షన్ బిల్లు ఎందుకు తేవట్లేదు?
హిందూ మతాన్ని కించపరిచే చర్యలను అడ్డుకుంటానని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ హిందువులను బలవంతంగా వేరే మతంలోకి కన్వర్ట్ చేసే చర్యలను అడ్డుకుంటాన
హిందూ మతాన్ని కించపరిచే చర్యలను అడ్డుకుంటానని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ హిందువులను బలవంతంగా వేరే మతంలోకి కన్వర్ట్ చేసే చర్యలను అడ్డుకుంటానని పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ బలవంతపు మతమార్పిడులకు వ్యతిరేకంగా పోరాడుతుంటే.. రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి బీజేపీ నాయకత్వం నిద్రపోతోందని సెటైర్ వేశారు. పదవులు కాపాడుకునేందుకు నిద్రపోతున్నారా.. లేక చంద్రబాబు నుంచి ఏదైనా పొందుతున్నారా అంటూ సూటిగా ప్రశ్నించారు. ఎవరికి ఏ అన్యాయం జరిగినా.. ఎక్కడ ఏ అన్యాయం జరిగినా విజయసాయిరెడ్డి ముందుంటాడని పేర్కొన్నారు. తాను అధికారంలోకి వస్తే సాధిక్ లాంటి వారికి యూపీలో ఏ ట్రీట్‌మెంట్ ఉంటుందో.. అదే ట్రీట్‌మెంట్ ఇస్తానని హెచ్చరించారు. 175 సీట్లకు గాను చంద్రబాబుకు 162 సీట్లు ఉన్నా మిగతా రాష్ట్రాల్లో మాదిరిగా యాంటీ రిలీజియస్ కన్వర్షన్ బిల్లు ఎందుకు తీసుకురావడం లేదని విజయసాయి ప్రశ్నించారు.