Health14th Nov 12:11 PMSunil Byrisetty1 min read

భారత్‌లో ఆరోగ్య సంక్షోభంపై WHO హెచ్చరిక

భారత్‌లో ఆరోగ్య సంక్షోభంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) హెచ్చరిక చేసింది. WHO గ్రేడ్-3 ఎమర్జెన్సీ ప్రకటన చేసింది. భారత్‌ను WHO హైరిస్క్ జాబితాలో చేర్చింది. 2027 సెప్టెంబర్ వరకు ఎల్‌నిన

భారత్‌లో ఆరోగ్య సంక్షోభంపై WHO హెచ్చరిక
భారత్‌లో ఆరోగ్య సంక్షోభంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) హెచ్చరిక చేసింది. WHO గ్రేడ్-3 ఎమర్జెన్సీ ప్రకటన చేసింది. భారత్‌ను WHO హైరిస్క్ జాబితాలో చేర్చింది. 2027 సెప్టెంబర్ వరకు ఎల్‌నినో ప్రభావం ఉంటుందని, సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని హెచ్చరించింది. మరోవైపు రికార్డు స్థాయిలో పెరగనున్న ఉష్ణోగ్రతలు కారణంగా ఎండలతో డీహైడ్రేషన్, వడదెబ్బ ముప్పు ఉంటుందని సూచించింది. ఈ నేపథ్యంలో డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని, గుండె, కిడ్నీ, శ్వాసకోశ రోగులకు అధిక ముప్పు ఉంటుందని హెచ్చరించింది. పంటల దిగుబడి తగ్గి ఆహార సంక్షోభం వచ్చే అవకాశం ఉందని, ఆరోగ్య రంగాన్ని అప్రమత్తం చేయాలని భారత్ కు WHO సూచనలు చేసింది.
Scroll for the next article