Politics26th Sep 05:27 PMSunil Byrisetty1 min read
విజయసాయిరెడ్డి అసలు టార్గెట్ ఎవరు?
మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కొత్త పార్టీ, కొత్త మీడియాపై ప్రెస్ మీట్లు, ట్వీట్లు వేస్తూ వస్తున్నారు. అయితే సాయిరెడ్డి చేస్తున్న ప్రీ రాజకీయం గమనిస్తే తన పార్టీ ఆవిర్భావానికి ముందే వై
మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కొత్త పార్టీ, కొత్త మీడియాపై ప్రెస్ మీట్లు, ట్వీట్లు వేస్తూ వస్తున్నారు. అయితే సాయిరెడ్డి చేస్తున్న ప్రీ రాజకీయం గమనిస్తే తన పార్టీ ఆవిర్భావానికి ముందే వైసీపీని ప్రజలలో వీలైనంత పలుచన చేయాలనుకుంటున్నారనే భావన కలుగుతుంది. అందులో భాగంగానే గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో మత మార్పిడిల శాతం అనూహ్యంగా పెరిగిందని దీని వెనుక జగన్ ప్రోత్సాహం ఉందంటూ వైసీపీ మీద మత బాంబ్ వేశారు. అలాగే వైసీపీ పార్టీ అధికార అధినేత హోదాలో వైఎస్ జగన్ ఉన్నప్పటికీ పార్టీ అంతర్గత వ్యవహారాలలో వైఎస్ జగన్ నెంబర్ – 2 అంటూ పార్టీ నెంబర్ – 1 స్థానాన్ని మాజీ సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణ రెడ్డి ఖాతాలో వేశారు. వైసీపీ పార్టీ లో జరిగే ప్రతి కార్యక్రమం కూడా సజ్జల ఆదేశాలతోనే జరుగుతాయని అన్నారు. ఇక తాజాగా సిపిఐ నేతలు జగన్ తో భేటీ అయిన సందర్భంగా పార్టీ అధ్యక్షుడి కన్నా ఎత్తు కుర్చీలో సజ్జల కూర్చున్నారంటూ సెటైర్లు వేశారు. దీనితో అసలు విజయసాయిఅసలు టార్గెట్ జగనా.? లేదా సజ్జలా.? అన్న సందేహం వ్యక్తమవుతోంది.