Politics23rd Jul 11:29 AMSunil Byrisetty1 min read
ఉపరాష్ట్రపతి రేసులో నితీశ్, శశిథరూర్!
ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖడ్ అనూహ్యంగా రాజీనామా చేయడంతో తదుపరి ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. తెర పైకి వస్తున్న పేర్లు చూస్తే, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, సీనియర్ ఎంపీ శ
ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖడ్ అనూహ్యంగా రాజీనామా చేయడంతో తదుపరి ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. తెర పైకి వస్తున్న పేర్లు చూస్తే, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, సీనియర్ ఎంపీ శశిథరూర్, జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా , దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా తదితరులున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొద్ది నెలల్లో బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయనకు ఉపరాష్ట్రపతి పదవి కల్పించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అదే జరిగితే.. బిహార్‌లో ముఖ్యమంత్రి పదవి బీజేపీకి దక్కుతుంది. నితీశ్ కుమారుడు నిషాంత్ డిప్యూటీ సీఎం అయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తూ కాంగ్రెస్‌కు దూరమవుతున్న ఎంపీ శశిథరూర్ కు ఉప రాష్ట్రపతి పదవి ఇస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అలాగే దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పేర్లూ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.