Politics1st Nov 04:58 PMSunil Byrisetty1 min read

ఒక్క పులివెందులలోనే ఎందుకు వివాదాలు?

పులివెందుల స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఆడుతున్న రాజకీయ నాటకాలు నేడు బట్టబయలయ్యాయని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. రాష్ట్రవ్యాప్తం

ఒక్క పులివెందులలోనే ఎందుకు వివాదాలు?
పులివెందుల స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఆడుతున్న రాజకీయ నాటకాలు నేడు బట్టబయలయ్యాయని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతుంటే ఒక్క పులివెందులలోనే ఎందుకు వివాదాలు, ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. గత 40 ఏళ్లుగా పులివెందుల ప్రజలు భయాందోళనల మధ్య ఓటు వేసే పరిస్థితులు ఉండేవన్నారు. ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం, పోలీసు యంత్రాంగం, కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని పేర్కొన్నారు. పులివెందులలో ఓటమి తప్పదనే భయంతోనే జగన్ ఈ డ్రామాలకు తెరతీశారన్నారు. వైసీపీ అంతర్గత సర్వేల్లో ప్రతికూల ఫలితాలు వస్తున్నాయనే ఆందోళనతో ప్రజలను, అధికారులను గందరగోళానికి గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
Scroll for the next article