News17th Oct 12:30 PMSunil Byrisetty1 min read
శమీ వృక్షమంటే శని కాదు.. బంగారం
శమీ చెట్టు శనికి ప్రీతి అయితే, విజయదశమి రోజు ఆ ఆకులనే బంగారంగా ఎందుకు పంచుకుంటాం? శని అంటే కష్టం కదా, బంగారం అంటే లక్ష్మి కదా? అనే అనుమానాలు చాలా మందిలో ఉంటాయి. ఇందులో రెండు రహస్యా
శమీ చెట్టు శనికి ప్రీతి అయితే, విజయదశమి రోజు ఆ ఆకులనే బంగారంగా ఎందుకు పంచుకుంటాం? శని అంటే కష్టం కదా, బంగారం అంటే లక్ష్మి కదా? అనే అనుమానాలు చాలా మందిలో ఉంటాయి. ఇందులో రెండు రహస్యాలు ఉన్నాయి ఒకటి పురాణ రహస్యం, రెండు జ్యోతిష రహస్యం.
పురాణపరంగా ఇది విజయానికి గుర్తు. ఎప్పుడూ ఓటమి ఎరుగని చెట్టు. మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్తూ తమ ఆయుధాలన్నింటినీ ఒక మూటగా కట్టి శమీ చెట్టు మీద దాచారు. తిరిగి విజయదశమి రోజే ఆ ఆయుధాలను దించి, శమీ చెట్టుకు పూజ చేసి, కౌరవుల మీదకు యుద్ధానికి వెళ్లి గెలిచారు. అలాగే శ్రీరాముడు రావణుడి మీదకు వెళ్లే ముందు శమీ చెట్టును పూజించాడు. అందుకే దసరా రోజు శమీ పూజ అంటే "నా శత్రువుల మీద నాకు విజయం కలగాలి" అని చేసే పూజ. పెద్దలకు ఆకులు ఇచ్చి "శమీ శమయతే పాపం" - నా పాపాలను పోగొట్టు అని ఆశీర్వాదం తీసుకోవడం. ఇక జ్యోతిషపరంగా శని అంటే కష్టం కాదు, న్యాయం. ఇంకా కౌత్సుని కథలో వరతంతు మహర్షి శిష్యుడు కౌత్సుడు గురుదక్షిణ కోసం రఘుమహారాజును 14 కోట్ల బంగారు నాణేలు అడిగాడు.రఘుమహారాజు కుబేరుడి మీదకు దండెత్తితే, కుబేరుడు బంగారు వర్షం కురిపించాడు. ఆ బంగారం అంతా శమీ చెట్ల మీద పడి, ఆకులన్నీ బంగారు ఆకులుగా మారాయట. అప్పటి నుండి శమీ ఆకులను "స్వర్ణ పత్రాలు" - బంగారు ఆకులు అని పిలుస్తారు.