News21st Oct 02:00 PMSunil Byrisetty1 min read
పేదలకు కార్పొరేట్ వైద్య సేవలను ఎందుకు అడ్డుకుంటున్నారు?
కూటమి ప్రభుత్వం పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మించి, పేదలకు అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తెస్తుంటే, వైసీపీ దీనిపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని ఎమ్మెల్యే యరపతినేని శ
కూటమి ప్రభుత్వం పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మించి, పేదలకు అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తెస్తుంటే, వైసీపీ దీనిపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం పీపీపీ విధానం ద్వారా రాష్ట్ర విద్యార్థులకు 220 అదనపు మెడికల్ సీట్లు, అందులో 110 సీట్లు పేద, మధ్యతరగతి విద్యార్థులకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అందుబాటులోకి తెస్తోందని తెలిపారు. జగన్ విధానాల వల్ల కాలేజీల నిర్మాణానికి 10 సంవత్సరాలకు పైగా సమయం పడితే, కూటమి పీపీపీ విధానం ద్వారా కేవలం రెండేళ్లలో 1750 మెడికల్ సీట్లను అందుబాటులోకి వస్తాయని, ఈ విధానంలో ప్రభుత్వ నిబంధనలు, రిజర్వేషన్లు పూర్తిగా పాటించబడతాయని తెలిపారు. పీపీపీ విధానం ద్వారా పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని, కానీ జగన్మోహన్ రెడ్డి ఈ సేవలను పేదలకు చేరకుండా అడ్డుకోవడం దారుణమని ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు.