Politics16th Nov 11:43 AMSunil Byrisetty1 min read
సీఐఐ సమ్మిట్‌కు పవన్ దూరం.. కారణం ఇదేనా?
కూటమి ప్రభుత్వం వచ్చాక విశాఖలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సు అద్భుతంగా జరిగింది. రూ. పదమూడు లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి. అయితే ఈ సదస్సులో జనసేనకు చెందిన మంత్రులు దుర్గ
కూటమి ప్రభుత్వం వచ్చాక విశాఖలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సు అద్భుతంగా జరిగింది. రూ. పదమూడు లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి. అయితే ఈ సదస్సులో జనసేనకు చెందిన మంత్రులు దుర్గేష్, నాదెండ్ల కనిపించారు కానీ.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కనిపించలేదు. ఆయన సచివాలయంలోనే సమీక్షలు చేస్తున్నారు. దీనికి కారణం ఏమిటి అన్నదానిపై చర్చలు జరుగుతున్నాయి. సమ్మిట్‌లో జనసేన మంత్రులు నాదెండ్ల మనోహర్, దుర్గేష్ కీలకంగా వ్యవహరించారు. వీరు ఎంత క్రియాశీలకంగా వ్యవహరించినా పవన్ కల్యాణ్ రాకపోవడం మాత్రం కాస్త వెలితిగానే ఉంటుంది.
ఆయన రాకపోయినా సోషల్ మీడియాలో పెట్టుబడుల సదస్సు,ఇన్వెస్టర్ల నమ్మకంపై ఓ ట్వీట్ పెట్టారు. పెట్టుబడుల కోసం చంద్రబాబు, లోకేష్ తీవ్రంగా కష్టపడ్డారు. తాను వస్తే.. కొంత అయినా క్రెడిట్ తనకు ఇచ్చే ప్రయత్నం చేస్తారని అలా తనకు ఇష్టం లేదని పవన్ అనుకున్నారని అంటున్నారు. అదే సమయంలో యంత్రాంగం అంతా విశాఖలో ఉంటే పాలన గాడి తప్పే ప్రమాదం ఉంది కాబట్టి తాను.. అమరావతి నుంచి మానిటర్ చేశారని చెబుతున్నారు.