Technology27th Sep 01:10 PMSunil Byrisetty1 min read

గడియారం 10.10నే ఎందుకు?!

గోడ గడియారాల ప్రకటనలు, షోరూమ్‌లు, ఫోటోల్లో సమయాన్ని 10:10 గా చూపించడం వెనుక ముఖ్యమైన మార్కెటింగ్, సౌందర్య కారణాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. చాలా వరకు గడియారాల తయారీ కంపెనీల లోగోలు (

గడియారం 10.10నే ఎందుకు?!
గోడ గడియారాల ప్రకటనలు, షోరూమ్‌లు, ఫోటోల్లో సమయాన్ని 10:10 గా చూపించడం వెనుక ముఖ్యమైన మార్కెటింగ్, సౌందర్య కారణాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. చాలా వరకు గడియారాల తయారీ కంపెనీల లోగోలు (ఉదా: Rolex, Titan, Fastrack) డయల్ పైభాగంలో, అంటే 12 అంకె కింద ఉంటాయి. ముళ్ళు 10:10 వద్ద ఉన్నప్పుడు ఆ లోగో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ముళ్ళు 10, 2 మీద ఉన్నప్పుడు గడియారం చూడటానికి ఒక "చిరునవ్వు" (Smile / 'V' shape) ఆకారంలో కనిపిస్తుంది. ఇది చూసేవారికి మానసికంగా ఒక అనుకూలమైన సంతోషకరమైన భావనను కలిగిస్తుంది. అదే ముళ్ళు 8:20 దగ్గర ఉంటే గడియారం "విచారంగా"ఉన్నట్లు కనిపిస్తుంది. అనలాగ్ గడియారాలలో తారీఖు లేదా చిన్న డయల్స్ 3, 6, లేదా 9 అంకెల దగ్గర ఉంటాయి. ముళ్ళు 10:10 వద్ద ఉన్నప్పుడు ఈ వివరాలేవీ కూడా ముళ్ళ కింద స్పష్టంగా కనిపిస్తాయి. 12 కి ఇరువైపులా ముళ్ళు సమాన కోణంలో ఉండటం వల్ల గడియారం చూడటానికి చాలా అందంగా, బ్యాలెన్స్‌డ్‌గా కనిపిస్తుంది.
Scroll for the next article